మోదీతో రోడ్ షోలో పాల్గొన్న జపాన్ ప్రధాని

SMTV Desk 2017-09-13 14:40:23  The Prime Minister of Japan Shinzo Abe, Prime Minister Modi, Ahmedabad Road show in Gujarat

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : భార‌త్‌కు, త‌మ దేశానికి మ‌ధ్య ఉన్న‌ బంధం ప్రపం‍చంలోనే అత్యంత శక్తిమంతమైన బంధమ‌ని జపాన్‌ ప్రధాని షింజో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న షింజో అబె నేడు ప్రధాని మోదీతో కలిసి గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా షింజో మాట్లాడుతూ...భారత్‌తో ఆర్థిక, వ్యాపార బంధాలను మ‌రింత పెంచుకునేందుకు తాము ఆసక్తిని చూపుతున్నట్లు తెలిపారు. భారత్‌లో తిరుగులేని మానవ వనరులు ఉన్నాయని, దీంతో ఈ రెండింటిని కలిపితే ప్రపంచంలో ఇరు దేశాలు తిరుగులేని విజయాలను సాధిస్తాయ‌ని చెప్పారు. అందుకే భార‌త్‌లో బుల్లెట్‌ ట్రయిన్‌ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక, సాంకేతిక సాయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా సాధిస్తోన్న భార‌త్‌కు హై స్పీడ్‌ రైళ్ల సాంకేతిక సహకారాన్ని, భ‌విష్య‌త్తులో కూడా అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు.