అసలు నన్ను ఇలా ఎవరు అడగలేరు: నారా లోకేష్

SMTV Desk 2017-09-13 14:39:39  IT MINISTER LOKESH, VIJAYA NAGARAM TOUR,

విజయ నగరం సెప్టెంబర్ 13 : ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా, కొత్తవలసలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయాలంటూ సర్పంచ్ గోరేపల్లి అలేఖ్య, లోకేష్ కు ఒక వినతిపత్రాన్ని అందించారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ అని తెలియగానే మంత్రి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆపై మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పర్యటించిన నేను, ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ అభివృద్ది కావాలంటూ అడగడం చాలా శుభపరిణామం. అసలు ఇలా నన్నెవరు కలవలేదంటూ సర్పంచ్ అలేఖ్యను ప్రత్యేకంగా అభినందించారు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానన్నారు.