"ఎస్ స‌ర్‌", "ఎస్ మేడం" కు బ‌దులుగా "జై హింద్‌"

SMTV Desk 2017-09-13 14:14:48  madhya pradesh government, attendance, jaihind compulsory, Tribal Welfare Minister Vijay Shah.

మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 13 : నవంబర్ ఒకటవ తేదీ నుండి అన్ని పాఠ‌శాలల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. విద్యార్థులలో దేశ భక్తి భావాలను పెంపొందించే దిశగా తరగతిలో హాజరు తీసుకునేటప్పుడు "ఎస్ స‌ర్‌", "ఎస్ మేడం" కు బ‌దులుగా "జై హింద్‌" అనాల‌ని ఆదేశించింది. మొదట ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలో అక్టోబ‌ర్ 1న‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అన్ని పాఠ‌శాల‌లో న‌వంబ‌ర్ 1 వ తేదీ నుండి అమలులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి విజ‌య్ షా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. "జైహింద్" అని పలకడం అన్ని మతాల వారికి అనుకూలంగానే ఉంటుంది. నేటి విద్యార్థుల్లో దేశం పట్ల అభిమానం పెంచ‌డానికే ఈ నిర్ణయ౦ తీసుకున్నట్లు తెలిపారు.