సొంత కొడుకునే కిడ్నాప్ చేసిన హీరో

SMTV Desk 2017-09-13 14:12:23  Bhojpuri Actor Mohamed Shahid, Wife Mumtaz, Kidnaped son

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : భోజ్ పురికి చెందిన నటుడు మహ్మద్ షాహిద్, కొంతకాలం క్రితం భార్య ముంతాజ్ తో వివాదం వల్ల విడిపోయి మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే ముంతాజ్ కు ఓ కుమారుడు ఉన్నాడు. వీరు విడాకులు తీసుకునే సమయంలో న్యాయస్థానం బాలుడి బాధ్యతలు తల్లి కి అప్పగించింది. తన కుమారుడిని ఎలాగైనా తన వద్దకు తెచ్చుకోవాలని గత జూన్ లో కిడ్నాప్ చేశారు. బాలుడి ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులను ఆశ్రయించిన ముంతాజ్ భర్త షాహిద్ పై అనుమానం వ్యక్తం చేసింది. ఇదంతా గ్రహించిన షాహిద్ కుమారుడిని తీసుకుని వెంటనే పారిపోయి ఢిల్లీకి నివాసం మార్చాడు. గాలింపు చర్యల్లో భాగంగా సమాచారం అందుకున్న పోలీసులు షాహిద్‌ను అరెస్ట్‌ చేయగా, కుమారుడి కోసం తానే కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు చెప్పారు.