స్టాక్ మార్కెట్ దూకుడు

SMTV Desk 2017-09-13 13:12:57  indian stock market, bombay stock exchange listed company, NSC nifty, all time record.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : పాత రికార్డులను పటాపంచలు చేస్తూ.. భారత స్టాక్ మార్కెట్ సూచికలు ఒక్కసారిగా దూసుకెళ్ళాయి. నూతన కొనుగోళ్ళు ఎక్కువవుతున్న తరుణంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సరికొత్త రికార్డ్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన దగ్గరి నుండి, 11.05 గంటల సమయంలో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ విలువ రూ.1,36,24,495 కోట్లకు చేరుకోవడం విశేషం. గత కాలం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 32,231 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లు అర శాతం వరకూ లాభాల్లో నడుస్తు౦డగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 16 పాయింట్లు పెరిగి 10,108 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం టాటా, రిలయన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, బీపీసీఎల్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, హిందాల్కో కంపెనీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.