రాహుల్ గాంధీ పై మరో విమర్శ......

SMTV Desk 2017-09-13 12:46:04  smruthi irani central minister,criticised rahul gandhi

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 13 : వారసత్వ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. ఆయన విఫలమైన వారసుడు, తన విఫలమైన రాజకీయ ప్రయాణం గురించి చెప్పుకునేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీను ఎంచుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌ ప్రధాని మోదీపై చేసిన విమర్శలకు ఆమె కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ ఓ విఫలమైన వారసుడిగా ఆమె అభివర్ణించారు. నిజానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి గౌరవప్రదమైన చరిత్ర కలిగిన వారని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో భాజపా, ప్రధాని మోదీ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద ఓటమిని ఎదుర్కొంది. భారత్‌లో వారసత్వ సంప్రదాయం లేదు, అనటానికి ఇదే నిదర్శనం అని స్పష్టం చేసారు.