మొదటిలోనే విఫలమైన ఎం-777 శతఘ్ని

SMTV Desk 2017-09-13 11:02:58  M-777 Sataghni test Failed, India Agreement, America, Pokhran in Rajasthan

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : ఎన్నో ఏళ్ల నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నఎం-777 శతఘ్ని, ఎట్టకేలకు అమెరికాలోని బీఏఈ సిస్టమ్స్‌ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. అత్యంత తేలికగా ఉండే ఈ ఆయుధాలను సులువుగా పర్వత ప్రాంతాల్లో మోహరించవచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న హోవిట్టర్ శతఘ్ని విఫలమైంది. రాజస్థాన్ లోని పోఖ్రాన్‌లో తొలి క్షేత్ర స్థాయి పరీక్షలో శతఘ్ని బ్యారెల్ తునాతునకలైన ఈ నెల 2న జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటన పై దర్యాప్తునకు ఆదేశించింది. అమెరికా నుంచి 145 అల్ట్రా లైట్ ఎం-777 శతఘ్నులను సుమారు ఒక్కొకటి రూ. 35 కోట్లకు కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.