ఒక్క రోజు సీఎం గా కేటీఆర్?

SMTV Desk 2017-06-05 14:40:43  twitter, ktr, ktr on twitter, redy to act apcm

హైదరాబాద్, జూన్ 5 : ఒకే ఒక్కడు సినిమాలో లాగా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని..అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో మాట్లాడి సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయికిరణ్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ ను ఉద్ద్యేశించి ఒకే ఒక్కడు సినిమాలోలాగా ఒక్కరోజైనా మా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఉపయోగపడే కార్య క్రమాలు చేయండి ..దయచేసి నో అనకండి ప్లీజ్ అంటు ట్వీట్ చేశారు. అందుకు స్పందించిన ఆయన నేను రెడీ ముందుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడండీ అంటూ చమత్కరించారు. డాక్టర్ రామ్మోహన్ అనే వ్యక్తి ..కేటీఆర్ గారు ..మా ఏపీకి కూడా మీరే నాయకత్వం వహిస్తే బాగుంటుంది..నెల్లూరు నుండి మీ అభిమాని అని ట్వీట్ చేశాడు.. అందుకు స్పందించిన కేటీఆర్ తెలంగాణాలో చాలా పని ఉంది డాక్టర్ గారు అంటూ సమాధానం ఇచ్చారు. తెలుగోడు అనే అకౌంట్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు సంయుక్తంగా కడుతున్న పన్నుల వల్ల కలుగుతున్న ఫలాలను మీరు ఎంజాయి చేస్తున్నారు కదా ..మీ స్పందన ఏంటి అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించగా ..హైదరాబాద్ కు 430 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉంది..ఏపీ, తెలంగాణ 1956 లో కలిశాయి, 2014 లో విడిపోయాయి అంటూ సూటిగా స్పందించారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలో ఎవరినో ఒకరిని ఎంచుకోండి అని మహేష్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేయగా ఈ ముందస్తు ఎంపికల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నేనేం ఏపీ ఓటరును కాదు అంటూ చమత్కరించారు. ఏపీలో మీకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వాళ్లను కలిసేందుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అని రాఘవ్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ కు ఇప్పట్లో అలాంటి ఆలోచన ఏం లేదు అంటూ స మాధానం ఇచ్చారు. ఇటాలియన్ పిజ్జా, ఆంధ్ర పప్పులో మళ్ళీ మళ్ళీ కావలని ఏది కోరుకుంటారు అని ప్రశ్నించగా తెలంగాణ పచ్చిపులుసు అని మంత్రి స్పందించారు. ఈ ఆదివారం మీరు భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తారా.. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో వలే మ్యాచ్ చూస్తారా అని సాయి అనే వ్యక్తి ప్రశ్నించగా ముఖ్యమంత్రి గారికి క్రికెట్ చూడటం ఇష్టం, సీఎం గారు, నేను కూడా ఈ ఆటలో అందరి లాగానే భారత దేశం గెలువాలని కోరుకుంటున్నాం అని రీట్వీట్ చేశారు.