డిస్ట్రిబ్యూట‌ర్‌గా మారనున్న స్టార్ హీరో

SMTV Desk 2017-09-12 17:30:40  Aamir Khan, Movie distributor, secret superstar movie, shahrukh khan, red chillies entertainment.

ముంబై, సెప్టెంబర్ 12 : స్టార్ హీరోలు మెగాఫోన్ పట్టుకోవడం అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఒక పక్క హీరోగా, మరోపక్క దర్శకత్వం, నిర్మాణ రంగానికి సంబంధించి అన్ని విభాగాలలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన ప్రతిభ నిరూపించుకున్నారు. అయితే వీటితో పాటు త్వరలో సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌గా కూడా అమీర్ ఖాన్ మారబోతునట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు చర్చలు పూర్తయినట్టు తెలుస్తుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన తన తదుపరి చిత్ర౦ "సీక్రెట్ సూప‌ర్‌స్టార్" సినిమానే అమీర్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రెడ్‌ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో పంపిణీ రంగంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో తెర మీదే కాకుండా తెర వెనకాల కూడా ఖాన్ ల మధ్య పోటీ మొదలవబోతుందన్న మాట. ఏదైతేనేం వారిద్దరు సక్సెస్ సాధించాలని మనం కూడా కోరుకుందాం.