జీఎస్టీ పన్ను శ్లాబులు కుదించే యోచన ?

SMTV Desk 2017-09-12 17:04:30  GST tax slabs, Central government

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఒకే పన్ను ఒకే వస్తువు (జీఎస్టీ) విధానం రెండు నెలలు గడిచిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణగా పేర్కొన్న జీఎస్టీని ఒక వస్తువుకు ఒకే పన్ను విధించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వస్తువుల ధరలను బట్టి పన్నులను 5, 12, 18, 28 శ్లాబుల కింద వస్తువులపై పన్ను విధిస్తారు. తాజాగా ఈ నాలుగు శ్లాబులను కూడా రెండు లేదా ఒకటికి కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని లేదా పన్ను రేటు తగ్గించాలని కొద్ది రోజులుగా రాష్ట్రాల నుంచి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా 28శాతం పన్నుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 30 వస్తువులపై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే. ఖాదీభండార్లలో అమ్మే ఖాదీ వస్త్రాలకు పన్ను మినహాయించారు. నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించారు. దీంతో 28శాతం శ్లాబును తొలగిస్తే మంచిదని కేంద్రం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.