ఫేస్ బుక్ యూజర్స్ కు మరో ఆఫర్...

SMTV Desk 2017-09-12 16:28:30  facebook, new feature in facebook, instant video feature in facebook

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యుజర్స్ ను ఆకట్టుకు౦టునే ఉన్నాయి. త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఇన్‌స్టంట్ వీడియోస్ పేరిట మొదట ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఫేస్‌బుక్‌ను వాడుతున్న యూజర్లకు లభ్యం కానుంది. ఇన్‌స్టంట్ వీడియోస్ ఫీచర్ గతంలో వచ్చిన ఇన్‌స్టంట్ ఆర్టిక‌ల్స్ ఫీచ‌ర్ లాగానే ఉంటుంది. యూజ‌ర్ త‌న స్మార్ట్‌ఫోన్‌ను వైఫైకి క‌నెక్ట్ చేసిన‌ప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్‌లోని పోస్టుల్లో ఉండే వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి. దీంతో మొబైల్ డేటా సేవ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ సంస్థ అంతర్గతంగా పరిశీలిస్తోంది.