అమాయకత్వంపై అఘాయిత్యమా ..!

SMTV Desk 2017-09-12 15:47:01  Seven-year-old girl, Sidayya in Capra, Rape case, police

హైదరాబాద్: ఆభం, శుభం తెలియని ఏడేళ్ల బాలికపై 60 ఏళ్ళ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కాప్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కాప్రాలో సైదయ్య(60) నివసిస్తున్నాడు. ఏడేళ్ల బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని, ఇంట్లోకి తీసుకెళ్లి బట్టలు తీయమని చెప్పి చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జరిగిన విషయాన్ని బాలిక తన అమ్మమ్మకు చెప్పగా, కుటుంబ సభ్యులు సైదయ్యను కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ది చేశారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి సైదయ్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.