పవర్ స్టార్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య అదుర్స్..!

SMTV Desk 2017-09-12 15:26:22  PAWAR STAR, PAWAN KALYAN, TWITTER ACCOUNT, TWITTER FOLLOWERS, 2 CRORES, JANASENA PARTY

హైదరాబాద్, సెప్టెంబర్ 12 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఏదైనా విషయాన్నీ తెలియజేయాలన్నా, శుభాకాంక్షలు తెలపాలన్నా, ఉద్యమానికి నాంది పలకాలన్నా, విమర్శించాలన్నా కూడా పవన్ ట్విట్టర్ నే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆయన ట్విట్టర్ ఫాలోవ‌ర్ల సంఖ్య నేటికి రెండు మిలియన్లకు చేరుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అయితే నేరుగా కాకుండా కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే పవన్ స్పందించడం పట్ల విమర్శలు చేసిన వారు కొందరైతే, ఆయన స్పందించే క్రమంలో ట్విట్లలో ఎన్నో స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయంటూ కూడా విమర్శించేవారు మరికొందరు.