ఆ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు..

SMTV Desk 2017-09-12 15:11:39  julie-2, lakshmi rai, film sensor board

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తనకంటూ తెలుగు, తమిళ బాషల్లో ఓక గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి రాయ్ తాజాగా బాలీవుడ్ లొకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపక్ శివదాసిని దర్శకత్వంలో లక్ష్మి రాయ్ నటిస్తున్న ‘జూలీ -2, బోల్డ్, బ్యూటిఫుల్, బ్లెస్సెడ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో సంచలనంగా మారి౦ది. అయితే అసలు విషయం ఏంటంటే..టైటిల్ కు తగ్గట్టే బోల్డ్ గా రూపొందిన ఈ సినిమాలో సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, ఒక్క సిన్ కట్ లేకుండా సెన్సార్ పూర్తవ్వడం విశేషం.ఈ సినిమాతో లక్ష్మి రాయ్ ఖాతాలో మంచి హిట్ చేరుతుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాలో ఎంతో బలమైన కంటెంట్ ఉందని బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.