ఢిల్లీలో 30 శాతం మంది డ్రైవర్లు దీనితో బాధపడుతున్నారు.

SMTV Desk 2017-09-12 14:09:10  Delhi drivers, Colour blindness,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : దేశ రాజధాని ఢిల్లీలో, కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో వివిధ వాహనాలు నడిపే చాలామంది డ్రైవర్లు తీవ్రమైన దృష్టి లోపం తో బాధపడుతున్నట్లు తేలింది. ఢిల్లీలో ప్రతి పదిమంది డ్రైవర్లలో ముగ్గురు డ్రైవర్లు దృష్టిదోషాలతో బాధపడుతున్నారని వెల్లడై౦ది. 627 ప్రైవేటు కార్లు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు నడిపే డ్రైవర్లలో 19 శాతం మందికి తీవ్ర వర్ణ అంధత్వం (కలర్ బ్లైండ్ నెస్) ఎదుర్కొంటుండగా, ఇంకో 23 శాతం మంది డ్రైవర్లు స్వల్ప వర్ణ అంధత్వ సమస్యను ఎదుర్కొ౦టున్నట్లు ఈ విచారణలో బయటపడింది. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా చాలామంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్నారని కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ వెల్లడించింది.