ఇర్మా భీభత్సంపై ప్రవాస భారతీయులు ఏమన్నారంటే..

SMTV Desk 2017-09-12 13:55:41  Irma, Hurricane, NRI, Florida

ప్లోరిడా, సెప్టెంబర్ 12: ఇర్మా సృష్టించిన సంక్షోభంలోనే కొట్టు మిట్టాడుతున్న అమెరికా సహాయక చర్యలు ప్రారంభించింది. ఇర్మా భీభత్సంపై ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు మాట్లాడుతూ... ఈ తుఫాను చాలా భయంకరంగా ఉందని, తమ జీవితంలో ఇంతటి పెను విపత్తు ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఇర్మా తీరాన్ని దాటినా, తమను ఇంకా పునరావాస కేంద్రాల నుండి బయటకు అనుమతివ్వడంలేదని చెప్పారు. అయితే రోడ్లు బాగు చేసి, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతులను కల్పించిన తరువాత మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారని, ఫ్లోరిడాలోని టాంప నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న కర్నూలు జిల్లా బీ తాండ్రపాడు వాసి హరీశ్ కుమార్ చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన ఆయన, ఆస్తి నష్టం ఏ మేరకు సంభవించిందో అంచనా వేయలేకపోతున్నామని అన్నారు.