ప్రత్యేక బస్సులు, అదనపు ఛార్జీలు : ఇది ఆర్టీసీ తీరు

SMTV Desk 2017-09-12 13:14:12  Dussehra festival season, RTC special busses, 50% extra charge,

అమరావతి, సెప్టెంబర్ 12 : ప్రజల అవసరాలను క్యాష్ చేసుకోవడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు తేడా లేకుండా పోయింది. రానున్న దసరా పండగను పురస్కరించుకొని ప్రయాణికుల డిమాండ్ ను బట్టి ఆర్టీసీ ఈ నెల 21 వ తేదీ నుంచి 1200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐతే ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఇప్పటికే వివిధ ప్రా౦తాల్లో తిరిగే బస్సులలో రిజర్వేషన్ లు దాదాపు పూర్తైపోయాయని అధికారులు వెల్లడించారు. ఈ పండగ సీజన్ లో ప్రత్యేక బస్సులు ఎక్కువ శాతం హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్‌ మధ్య నడవనున్నాయి. 27, 28, 29, 30 రోజుల్లో విజయవాడ కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉండడం వల్ల ఆ సమయంలో పెద్ద సంఖ్యలో బస్సులను నడపనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించామని, అవసరమైనన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయరావు ప్రకటించారు.