కల్తీనూనె గుట్టు రట్టు

SMTV Desk 2017-06-05 13:28:17  adulteration oil,cattle,bocconi ,fat, unhealthy, kissan agrowfeed company rangareddy dist, yacharam

హైదరాబాద్, జూన్ 5 : పశువుల బొక్కలు, కొవ్వుతో కల్తీనూనె తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్ వో టీ పోలీసులు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి కిసాన్ ఆగ్రో ఫీడ్ కంపెనీలో బొక్కలతో నూనె తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం తనిఖీలు చేసి, నిందితులను ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు రెండువేల లీటర్ల నూనె, ఎనబై డ్రమ్ముల ముడిసరుకు, 100 బస్తాల బొక్కలు, 300 కిలోల కొవ్వును స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన కొందరు వ్యక్తులు కోళ్లదాణా తయారీ పేరుతో కొత్తపల్లి లో కిసాన్ ఆగ్రోఫీడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. వీరికి ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి సమీపంలో పశువుల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీ కూడా ఉన్నది. అక్కడ మిగిలిపొయిన బొక్కలు, కొవ్వును కొత్తపల్లి ఫ్యాక్టరీకి తరలించి నూనె తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి నిత్యం వందల లీటర్ల నునెను నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్ వో టీ బృందం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కాశివిశ్వనాథ్, పలువురు పోలీసులు ఆదివారం ఫ్యాక్టరి పై దాడి చేసి, ఈ మేరకు యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ కంపెనీ బ్లాస్టింగ్ లకు పాల్పడుతుండటంతో ఎస్ వో టీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కంపెనీ నుంచి దుర్వాసన రావడంతో కొత్తపల్లి వాసులు చాలాసార్లు కంపెనీ ముందు ఆదోళనలు ధర్నాలు చేపట్టారు. ఇటివల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గ్రామానికి రాగా, స్థానికులు ఈ కంపెనీ పై ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విచారణ జరిపి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఫ్యాక్టరీ బయట తాళం వేసి ఉన్నా, కంపెనీ యాజమాన్యం మాత్రం లోలోపల యధేచ్చగా కల్తీనునె తయారీ కి పాల్పడింది..