లడఖ్ లో మహిళలను వెంటాడుతున్న టెన్షన్...!

SMTV Desk 2017-09-12 11:50:49  LADAKH, LOVE JIHAD, ISLAM RELIGION, LADAKH BUDDHIST ASSOCIATION.

జమ్మూకశ్మీర్, సెప్టెంబర్ 12 : జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంతంలో యువతులను ఒక కొత్త సమస్య వెంటాడుతోంది. కొంతమంది ముస్లిం యువకులు "లవ్ జీహాద్" అనే అస్త్రాన్ని ప్రయోగిస్తూ అమ్మాయిలను వశపరుచుకొని వారిని ఇస్లాం మతంలోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు విషయంలోకి వెళితే... ద్రాస్ సెక్టార్ కు చెందిన ముర్తాజా అఘా (32) అనే యువకుడు ఒక బౌద్ధమత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ముస్లిం మతంలోకి మార్చి ఆమె పేరును షైఫాగా మార్చాడు. కాని ఆ అమ్మాయే ముర్తాజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని స్వయంగా సీఎం మెహబూబా ముఫ్తీకి ఒక లేఖ రాసింది. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతుండడం పట్ల లడఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ (ఎల్బీఏ) నిరసనలు చేస్తోంది. షైఫాను తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఆ లేఖ రాయించారని, ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లనున్నట్లు ఎల్బీఏ ప్రతినిధి పీటీ కున్జాంగ్ వెల్లడించారు. ఇలాంటి ఘోరమైన సంఘటనలను చూస్తూ ఉండలేకపోతున్నామని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలను చేపట్టాలని కోరారు. కాగా బౌద్ధ అమ్మాయిలకు పెళ్లి అయిన తర్వాత,మాత్రమే వారు పెళ్ళాడింది ఒక ముస్లిం వ్యక్తి ని అని తెలియడం లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం.