నటుడిగా ఇదో సవాల్‌ : సచిన్ జోషి

SMTV Desk 2017-09-12 07:49:28  sachin joshi, veedevadu movie tatineni satya, september 15

హైదరాబాద్ సెప్టెంబర్ 12: సచిన్ జోషి కథానాయకుడుగా తాతినేని సత్య దర్శకత్వం లో వస్తున్న ‘వీడెవడు’ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా సచిన్ జోషి మీడియా తో మాట్లాడుతూ ‘ మన చిత్ర సీమలో విజయాల శాతం చాలా తక్కువ. హాలీవుడ్‌లో నూటికి దాదాపు నలభై చిత్రాలు విజయవంతం అవుతాయి. ఇక్కడ కనీసం రెండు శాతం కూడా లేదు’ అని అన్నారు ఈసినిమా గురించి మాట్లాడుతూ ‘కబడ్డీ క్రీడాకారుని జీవితం చుట్టూ నడిచే కథ ఇది. యాక్షన్‌, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంది. కథానాయకుడి పాత్ర అంతు చిక్కదు. అతను మంచివాడా? కాదా? అనేది చివరి వరకూ తేలదు. యాక్షన్‌ ఘట్టాల్ని కూడా కబడ్డీ నేపథ్యంలోనే చిత్రీకరించాం. అందుకోసం చాలా కష్టపడ్డాం. నా పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. నటుడిగా ఇదో సవాల్‌’ అన్నారు. ‘ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించాను, కథలు నచ్చడం వల్లే నిర్మాణ బాధ్యతలను మోశా. ప్రేక్షకుల ఆలోచన దోరణి మారింది, సినిమా కొత్తగా ఉంటేనే ఆదరిస్తున్నారు. బాహుబలి లాంటి సినిమానే అందుకు ఉదాహరణ. ఆ సినిమా అంతటి విజయాన్ని సాధించింది అంటే రాజమౌళి ప్రతిభే. అలంటి దర్శకుల కొరత చిత్రసీమలో ఉంద’న్నారు సచిన్ జోషి.