ఆ హక్కు మనకుందా..? భారత్ మొత్తాన్ని ప్రశ్నిస్తున్నా..? : ప్రధాని మోదీ

SMTV Desk 2017-09-11 16:40:22  Vande Mataram, prime minister Narendra Modi, swami vivekananda.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : భారతదేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలను సంధించారు. స్వామి వివేకానంద చికాగో సభలో 125 వ వార్షికోత్సవ౦ సందర్భంగా ఆయన విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ... " నేను ఇక్కడికి రాగానే అందరు కలిసి వందేమాతరం పాడారు, నాకు చాలా సంతోషం వేసింది. కాని మనకు వందేమాతరం పాడే హక్కుందా..? ఒకసారి ఈ ప్రశ్న అందరం వేసుకోవాలి..? నేను ఈ ప్రశ్న భారతదేశం మొత్తాన్ని ప్రశ్నిస్తున్నాను?" అంటూ నిలదీశారు. అసలు దేశం, పరిశుభ్రత కోసం పాటుపడే వారికీ మాత్రమే వందేమాతరం పాడే హక్కుందని, నోట్లో పాన్ నమిలి ఈ భారత భూమి మీద ఉమ్మేసే మనకు అసలు హక్కు ఉందా? అంటూ మోదీ ప్రశ్నించారు. నా మాటలు కొందరికి నచ్చకపోవచ్చు, కాని కాస్త ఆలోచించండి అంటూ ఆయన హితబోధ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు భారతదేశ అభివృద్దికై కృషి చేయాలని ప్రధాని సూచించారు.