పసిడి ధర ఒక్కసారిగా నింగికెగసింది...

SMTV Desk 2017-09-11 16:08:40  new delhi, gold rate in market, silver rate in market

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 11: తాజాగా నేటి ట్రేడింగ్‌లో బంగారం ధర మరోసారి పైకెగసింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.470 పెరిగి రూ.31,000లకు చేరింది. పండుగ సీజన్‌ రానుండటం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి రూ.300 తగ్గిన వెండి కిలో రూ.41,700లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.77శాతం తగ్గి ఔన్సు 1,335.70 డాలర్లకు చేరింది.