పాఠశాలకు వెళ్ళాలంటే నడక తప్పదా..? : సుప్రీంకోర్టు

SMTV Desk 2017-09-11 15:38:18  school children, supreme court, justice madan b lokur, justice deepak gupta.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : పాఠశాలకు వెళ్ళాలంటే చిన్న పిల్లలు దాదాపు మూడు, నాలుగేసి కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితి ఎప్పటికీ మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసలు విద్యా హక్కు చట్టం ఆశయానికే ఈ వ్యవస్థ వ్యతిరేకమని పేర్కొంది. కేరళలోని ఓ పాఠశాల స్థాయి పెంపుదలపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చదువుకోవడానికి ఒకప్పుడు వందల మైళ్ళు దూరం వెళ్ళాల్సి వచ్చేది, కాని ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని సౌకర్యాలున్నా, ఇంకా పాఠశాలకు వెళ్ళాలంటే నడవవలసిన పరిస్థితి తలెత్తడం విచారకరం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్న౦ చేయాలని సూచించింది.