ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్‌ ఫెయిర్-2017 సదస్సులో పాల్గొన్న నారా లోకేష్

SMTV Desk 2017-09-11 14:30:07  International Innovation Fair -2017, IT minister Lokesh , Visakhapatnam

విశాఖపట్నం, సెప్టెంబర్ 11 : సాంకేతికతను అత్యుత్తమ స్థాయిలో వినియోగించుకోవడం ద్వారానే వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో మొదటి వరుసలో నిలిచామని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్‌ ఫెయిర్-2017 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాంకేతిక వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తిని వివరించారు. సాంకేతికత ఆధారంగా సేవలు ఆ విధంగా పటిష్ట పరిచామని చెప్పారు. ఈ కార్య క్రమం లో విశాఖ ఎంపీ హరిబాబు, శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు, ఐటీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.