మీ ఫోన్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉందా..?

SMTV Desk 2017-09-11 14:20:23  new delhi, artificial intelligence software, caneda,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: సెల్ ఫోన్ లో మాట్లాడుతూ...బైక్ డ్రైవింగ్ చేయడం, కార్ డ్రైవింగ్ చేయడం చాలా కామన్ గా మారిపోయింది. ఈ మధ్య అనేక ప్రమాదాలకు దారి తీస్తున్న సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలను నివారించేందుకు కెనడాలోని వాటర్లు వర్సిటీ పరిశోధకులు కొత్త సాప్ట్‌వేర్‌ని అభివృద్ధి పరిచారు. ఈ సాఫ్ట్ వేర్ కు పరిశోధకులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌గా (ఏఐ)గా నామకరణం చేశారు. ఈ సారి కొత్త టెక్నాలజీని మొబైల్‌ లోని కెమెరాకు అనుసంధానం చేస్తారు. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు... డ్రైవింగ్‌ చేసే సమయంలో మన హృదయ ప్రతిస్పందనలు, చేతుల కదలికల్లో ఒత్తిడి, ఆందోళనలను కూడా గుర్తించేలా అభివృద్ధి చేశామని, డ్రైవింగ్‌ చేసే సమయం‍లో ఒత్తిడికి గురైనా.. ఇతరులతో సీరియస్‌గా మాట్లాడుతున్నా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గుర్తించి.. మిమ్మిల్ని అలెర్ట్‌ చేస్తుందని ప్రొఫెసర్‌ ఫాఖరి క్యారీ చెబుతున్నారు. ఈ టెక్నాలజీని అడ్వాన్స్‌డ్‌ సెల్ప్‌ డ్రైవింగ్‌ కార్లలో ఉపయోగించేందుకు అభివృద్ధి చేసినా, సెల్ ఫోన్ ప్రమాదాలు భారీగా పెరుగుతుండడంతో, అందరూ ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చామని.. ప్రొఫెసర్‌ ఫాఖరి క్యారీ చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని వినియోగించడం వల్ల 75 శాతం ప్రమాదాలను నివారించవచ్చని క్యారీ చెప్పారు.