అధికార పార్టీల వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమవుతున్న విపక్షాలు.. ఎందుకు..?

SMTV Desk 2017-09-11 14:10:29  telangana politics, andhra politics, congress,

హైదరాబాద్ సెప్టెంబర్ 11: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇటు తెలంగాణ లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడంతో టీడీపీ పార్టీని ప్రజలు గెలిపించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నాయి. అయితే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలను నమ్మించడంలో ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయా..? అంటే అవువనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎంత సేపు నాయకులను విమర్శించడం పై పెట్టిన శ్రద్ధ, పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో పెట్టడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్ 2014 ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీల్లో పార్టీ పక్కన బెట్టిన అంశాలను, సక్షేమ కార్యక్రమాలు, పథకాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అలాగే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, కొత్త రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చినా వాటిలో హామీ కొండంత ఉన్నా నెరవేర్చింది మాత్రం గోరంతే అని ప్రధాన ప్రతిపక్షం వైకాపా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవడంలో విఫలం చెందిందని, ఎంత సేపూ వైకాపా అధికార పార్టీ నాయకుడిని విమర్శించడం పైనే ప్రత్యేక శ్రద్ధ వహించడం, కేవలం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం, ప్రజా సమస్యలను పక్కనబెట్టడం లాంటివి తదితర కారణాలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ ఫోకస్ ను అధికార పార్టీ నాయకులపై కాకుండా..పరిపాలన పై దృష్టి పెట్టాలని అప్పుడే ప్రతిపక్షాలకు ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.