ఇకపై మొబైల్ నుండి కూడా ప్రింట్ తీసుకునే అవకాశం...

SMTV Desk 2017-09-11 13:09:17  hyderabad, sprocket, hp sprocket mobile photo printer

హైదరాబాద్, సెప్టెంబర్ 11: హెచ్ పి నుంచి ప్యాకెట్లో ఇమిడిపోయే ప్రింటర్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. మొబైల్ ద్వారా ప్రింట్ తీసుకునే అవకాశం లభి౦చిన౦దుకు కొనుగోలుదారులు ఉత్సాహ పడుతున్నారు. ఈ గాడ్జెట్ పేరు స్ప్రకేట్, 4.5 అంగుళాల వెడల్పు 3 అంగుళాల పొడవు ఉన్న ఈ ప్రింటర్ ను బ్లూటూత్ తో మొబైల్ కి కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత మొబైల్ లో ఫోటోలను అనుబంధ ఆప్ తో ప్రాథమికంగా ఎడిట్ చేసుకొని అక్కడి నుంచే ప్రింట్ ఇవ్వొచ్చు. అంతే కాదు ఫేస్ బుక్, ట్విట్టర్, క్విక్కర్ లాంటి సామజిక అనుసంధాన వేడుకలలోని ఫోటోలను కూడా నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. దీని ద్వారా ఒక్కో ఫోటోను ప్రింట్ తీసుకోవడానికి సుమారు ఒక్క నిమిషం పడుతుంది. ఆన్ లైన్ లో ఈ గాడ్జెట్ ధర సుమారు 14,000 గా ఉంది.