లాభాల బాటలో షేర్ మార్కెట్

SMTV Desk 2017-09-11 12:30:00  Today Share Market, Share Rate,NIFTY, BSE SENSEX

ముంబయి, సెప్టెంబర్ 11: నేటి ఉదయం ప్రారంభం నుండే షేర్ మార్కెట్ దూకుడు ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న అనుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల బాట పడుతున్నాయి. మార్కెట్‌ ప్రీ ఓపెనింగ్‌లో సెన్సెక్స్‌‌కి 187 పాయింట్లు లాభం వచ్చింది. అయితే ఇదే సమయానికి నిఫ్టీ మళ్లీ 10వేల మైలురాయి చేరింది. మార్కెట్‌ మొదలైన తర్వాత కూడా నిఫ్టీ 10వేల బెంచ్‌ మార్క్‌కు దగ్గర్లోనే ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 157 పాయింట్లు ఎగబాకి 31,844 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 9,982 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాలు ప్రారంభం నుంచే లాభాల దిశ పట్టాయి. ఈ జాబితాలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టాటామోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అంట్‌ టీ, టెక్‌ మహింద్రా, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర సంస్థలు చెప్పుకోదగ్గవి.