కన్న కొడుకునే కడతేర్చిన కసాయి తండ్రి...

SMTV Desk 2017-09-11 12:19:13  nalgonda, thirumalagiri, kompelli, crime news nalgonda crime news, father killed by son

నల్గొండ, సెప్టెంబర్ 11: నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం కొంపెల్లి లో ఓ దారుణం చోటు చేసుకుంది. బయ్య రవి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా తన భార్యతో గొడవ పడుతున్నాడు. భర్త రవి వేదింపులు తాళలేక భార్య తన కొడుకులను తీసుకోని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపై కోపంతో మధ్యం మత్తులో ఉన్న రవి తన కొడుకు సాయిని అత్తగారింటి నుంచి తీసుకెళ్ళి గొంతు నులిమి చంపేసి బావిలో పడేశాడు. కొడుకు మృతితో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వార్త తెలిసి స్థానికులు విషాదం లో మునిగిపోయారు.బావిలో నుంచి మృతుదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.