రోజాకు, పురంధేశ్వరికి మధ్య వ్యత్యాసం ఇదే : మంత్రి మాణిక్యాలరావు

SMTV Desk 2017-09-11 11:45:51  Mla Roja, Daggubati Purandeswari, Minister Manikyala rao, Kakinada.

కాకినాడ, సెప్టెంబర్ 11 : ప్రజా సమస్యలపై స్పందించేటప్పుడు అలాగే బహిరంగ వేదికలపై ప్రసంగించేటప్పుడు భాష ఎలా ఉండకూడదో వైసీపీ నేత రోజాను చూసి నేర్చుకోవాలని, ఎలా మాట్లాడాలో పురంధరేశ్వరిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఇదే వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం అంటూ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బీజేపి కార్పోరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలని, అంతేకాని ఆవేశంలో నోరు జారడం ఎవరికీ మంచిది కాద౦టూ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.