మా న్యూక్లియర్ మిస్సైల్ వేసి తీరుతాం!: ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి : హూన్ చోలై

SMTV Desk 2017-09-11 11:38:56  USA, North Korea,External Affairs Minister , Nuclear Missiles, USA vs North Korea

ఉత్తరకొరియా, సెప్టెంబర్ 11: ఉత్తరకొరియా, అమెరికాపై కొనసాగిస్తున్న వికృత చర్యల నేపధ్యంలో ఇటీవల ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. అయితే ఐరాస ఆంక్షల నేపధ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి చోయ్ హూన్ చోలై మీడియాతో ఆయన మాట్లాడుతూ... అమెరికా ప్రధాన భూభాగంపై ఒకరోజు తప్పకుండా న్యూక్లియర్ మిస్సైల్ వేసి తీరుతామని స్పష్టం చేశారు. తమ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిని చేసి నిలబెట్టాలనదే ట్రంప్ ప్రయత్నమని ఆయన ఆరోపించారు. అమెరికా దేశం కంటే గొప్ప బలమైన ఆయుధాలను కొరియా కలిగి ఉందని, ట్రంప్ బెదిరింపులు తమను ఏం చేయలేవని మంత్రి చోయ్ జోస్యం చెప్పారు. ఉత్తర కొరియా శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగి ఉందని ఆయన ప్రకటించారు. అమెరికా కుయుక్తులను ఉత్తరకొరియా నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోందని తెలిపిన ఆయన ఐరాస ఆంక్షలకి తమ దేశం భయపడే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.