ముంబై అండర్-19 జట్టులో సచిన్ తనయుడు

SMTV Desk 2017-09-10 19:27:04  Mumbai Under 19, Mumbai Cricket Team, Sachin Tendulkar, JY Lele All India Under-19 Invitational One Day Tournament

ముంబై, సెప్టెంబర్ 10: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 16 నుంచి 23 వరకు జరిగే జేవై లీలీ ఆల్ ఇండియా అండర్-19 ఇన్విటేషనల్ వన్డే టోర్నీలో అర్జున్ ఆడనున్నాడు. గతంలోముంబై అండర్-14, అండర్ -16 క్రికెట్ జట్టులో అర్జున్ ఆడాడు. కాగా, సచిన్‌ది రైట్ హ్యాండ్ బ్యాటింగ్ అయితే అర్జున్‌ది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కావడం విశేషం.