టి-20 క్రికెట్ ప్రేక్షకులకు దగ్గరవుతోంది: ప్రీతి జింతా

SMTV Desk 2017-09-10 19:09:21  Bollywood Actress Preity Zinta, IPL franchise

ముంబై: సెప్టెంబర్ 10, ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌ వేగంగా ఎదుగుతోందని బాలివుడ్ నటి ప్రీతి జింతా అన్నారు.ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింతా, దక్షిణాఫ్రికాలో ఆరంభం కాబోతున్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో, స్టెలెన్‌ బాష్‌లో కూడా వాటా తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల టీ20 లీగుల్లో భారత క్రికెటర్లను అనుమతించడం వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎటువంటి ముప్పు ఉండదన్నారు. ఇతర లీగుల్లో ఆడటంతో వర్ధమాన క్రికెటర్లకు మేలు జరుగుతుందన్నారు. వారికి అనుభవం, పోటీతత్వం పెరుగుతాయన్నారు. టీ20 క్రికెట్‌ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఆట మూడు గంటలే ఉండటం, వేగంగా ముగియడం, ఉత్కంఠను రేకెత్తించడం వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోందన్నారు.