నిజామబాద్ లో పర్యటించనున్న హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

SMTV Desk 2017-09-10 18:32:13  BJP General Secretary, Muralidhar Rao, Senior BJP leader, Home Minister Rajnath Singh

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలని ముట్టడిస్తామని భాజపా హెచ్చరించింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నభాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని ప్రకటించారు. భాజపాలో చేరేందుకు చాలామంది నేతలు సంప్రదిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్‌ నేత, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిజామాబాద్‌లో త్వరలో పర్యటిస్తారని వెల్లడించారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా మిషన్‌ సౌత్‌ ప్రారంభించినట్లు చెప్పారు.