భారత్ కూడా ఉత్తరకొరియా నుండి అక్రమంగా దిగుమతులు చేసుకుంటుంది: ఐక్యరాజ్యసమితి

SMTV Desk 2017-09-10 18:00:14  North korea, United Nations Organization, Imports from North Korea, UNO rules, India

యునెస్కో, సెప్టెంబర్ 10: అగ్రదేశం అమెరికాపై ఉత్తరకొరియా రెచ్చగొట్టే తీరును ప్రదర్సిస్తున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) నార్త్ కొరియాపై ఆర్థిక, రవాణా, ఆయుధ పరమైన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఉత్తర కొరియా నుండి దిగుమతి చేసుకోరాదని ఆంక్షలు విధించినప్పటికీ కొన్ని దేశాలు ఆ నిర్ణయాన్ని పెడ చెవిన పెట్టాయని, ఆ దేశాల జాబితాలో భారత్ కూడా ఉందంటూ ఐరాస సంచలనాత్మకమైన ప్రకటన ఒకటి జారీ చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన కీలక సమాచారమంతా తమ వద్ద ఉందని పేర్కొంది. గత ఆరు నెలల్లో నార్త్ కొరియా ఇనుము, బొగ్గు తదితరాలను చైనాతో పాటు ఇండియా, శ్రీలంక, మలేషియా దేశాలకు ఎగుమతి చేయగా, ఇందుకుగాను మొత్తం 270 మిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగిందని ఐరాస వెల్లడించింది.