విమానం కొనండి... ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించండి: మాజీ కెప్టెన్ కపిల్

SMTV Desk 2017-09-10 17:07:34  BCCI, Kapil Dev, Team India, Ravi Shastri, Cricket

ముంబై, సెప్టెంబర్ 10: టీమిండియా ఆటగాళ్లకి సిరీస్‌కు సిరీస్‌కు మధ్య విరామం దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కనీసం రెండు వారాల గ్యాప్ ఇవ్వాలంటూ బీసీసీఐకి విన్నవించారు. అయితే ఈ నేపధ్యంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సలహా సంచలనం అయ్యింది. బీసీసీఐ సొంతంగా విమానం కొనాలని అందుకు సరిపడే డబ్బు బోర్డు దగ్గర ఉందంటూ కపిల్ దేవ్ సూచించారు. దీంతో సుమారు 20మంది నిరుద్యోగులకు ఉపాధితో పాటు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇదే విషయాన్ని కపిల్ ఎప్పుడో బోర్డుకి తెలపగా కొన్ని వివాదాల నేపథ్యంలో అప్పట్లో పక్కకు పెట్టారు. ఈ నేపధ్యంలో మాట్లాడిన ఆయన విరాట్ ఆట తీరును చూస్తుంటే టెందుల్కర్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేసారు. భారత ప్లేయర్లకు విదేశాల్లో టీ20 లీగుల్లో పాల్గొనేందుకు బోర్డు అనుమతి ఇవ్వాలని కపిల్ దేవ్ కోరారు.