ఇకపై ఎవరైనా బాహుబలి సినిమా సెట్టింగ్ లు చూడొచ్చు

SMTV Desk 2017-09-10 16:48:30  Ramoji Film City, Bahubali, setting

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి మాహిష్మతి సెట్ చూసేందుకు పర్యాటకులకు అవకాశం కల్పించారు. మొన్నటి వరకు మాహిష్మతి సెట్ విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం పర్యాటకులకు, అందరికి అనుమతిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ సెట్ వద్ద ఫోటోలు దిగేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. సూపర్ డూపర్ హిట్ ఐన బాహుబలి సినిమా సెట్టింగులు భారి ఖర్చుతో రూపొందించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.