మొదటి మూడు వన్డేలలో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత ఆటగాళ్లు వీరే...

SMTV Desk 2017-09-10 14:48:51  BCCI, India Australia ODI Series, Team India players, India Odi players

ముంబై, సెప్టెంబర్ 10: ఆతిథ్య శ్రీలంకను టెస్టు, వన్డే సిరీస్ లలో వైట్ వాష్ చేసి మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నెల 17నుండి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు సంభందించిన మొదటి మూడు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ (కెప్ట్‌న్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధోనీ, ధావన్, రాహుల్, పాండే, జాదవ్, రహానె, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కులదీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్, మహ్మద్ షమి శిఖర్, చహాల్, భువనేశ్వర్ కుమార్, షమీ, పాండే‌లనే ఈ పర్యటనకు ఎంపిక చేయడం గమనార్హం. కాగా, మొదటి వన్డే మ్యాచ్‌కు చెన్నై‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది.