ఆమె ఎవరో నాకు తెలియదు... ఎవరితో సంబంధం అంటగట్టినా లెక్కచేయను: హార్దిక్ పాండ్యా

SMTV Desk 2017-09-10 14:29:59  Hardik Pandya, Social Media,Parineeti Chopra, Pandya Tweets

ముంబై, సెప్టెంబర్ 10: తాను చేసిన ట్వీట్ కారణంగా టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకి, హీరోయిన్ పరిణీతి చోప్రాతో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాండ్యా స్పందిస్తూ తనకు ఎవరితో ఎఫైర్ అంటగట్టినా లెక్కచేయబోనని, అసలు పరిణీతి ఎవరో తనకు తెలియదని తెలిపాడు. ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడలేదంటూ, ఈ విషయంలో చెప్పేందుకు ఇంకేమీ లేదని హార్దిక్ స్పష్టం చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి ట్వీట్‌కి పాండ్యా కామెంట్ పెట్టడంతో, అమ్మాయిలపై కాదు ఆటపై దృష్టి పెట్టాలని నెటిజన్లు హితవు భోదించడంతో మొదలైన ఈ సంచలనం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న పూకార్లు వరకు వచ్చింది. కాగా, దీనిపై పరిణీతి కూడా అభిమానులకు తన వివరణను ఇదివరకే ఇచ్చింది.