మరో మానవ మృగానికి బలైన చిన్నారి.. పరిస్థితి విషమం...

SMTV Desk 2017-09-10 14:16:19  delhi, gandhi nagar, tagore public school, rape attemt in delhi

ఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశ రాజదాని ఢిల్లీ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ లో పని చేసే అటెండర్, అదే స్కూల్ లో చదువుతున్న ఐదేళ్ళ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గాంధీనగర్ టాగూర్ పబ్లిక్ స్కూల్ లో ఐదేళ్ళ బాలికపై, అటెండర్ గా పనిచేస్తున్న వికాస్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్త స్రావం తో ఇంటికి తిరిగి వెళ్ళిన చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు తో నిందితుడి పై కేసు నమోదు చేశారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.