ఇర్మా ప్రభావంపై ట్రంప్ ఆదేశాలు

SMTV Desk 2017-09-10 12:53:40  irma hurricane, Florida, Amerika pm, Donald John Trump, melania trump, twitter,

ఫ్లోరిడా, సెప్టెంబర్ 10 : ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. 25 నుంచి 51 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మియామి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌లు అధికారులతో ప్రత్యేక సమావేశమై, ఇర్మా తుఫానుతో పొంచి ఉన్నప్రాంతాల్లోంచి ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఆస్తులకంటే ప్రాణం ఎంతో విలువైనదన్న ఆయన అధికారులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇర్మా తుఫాను పై తాజాగా సమీక్షించిన ట్రంప్ ఇర్మాను అత్యంత విధ్వంసం సృష్టించే శక్తి గల తుఫానుగా అభివర్ణించారు. తుఫాను గండం నేపథ్యంలో మంత్రివర్గ సహచరులు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమాలోచన చేస్తున్న ఆయన తుఫాను ముప్పు చేప్పటిన చర్యలపై ఆరాదీశారు. వీలైనంత వేగంతో అవసరమైన చర్యలని తీసుకోవాలని మరోసారి అధికారులను ఆదేశించారు. అలాగే, ట్రంప్ భార్య మెలానియా సైతం ప్రజలు ఆస్తుల కోసం చింతించవద్దని ముప్పు ఉన్న ప్రాంతాల్లోంచి వెంటనే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ట్వీట్టర్ లో కోరారు.