ఇండియా లో కూడా బులెట్ రైళ్ళు

SMTV Desk 2017-09-10 12:36:56  bullet train-ahmdabad-mubai-foundation stone

న్యూ ఢిల్లీ,సెప్టెంబర్-10: భారత దేశాన్ని పాశ్చత్య దేశాలకు దీటుగా అభివృద్ధి చేయడం కోసం ప్రధాని మోదీ చేపట్టిన మరో ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. యే దేశ అభివృద్ధి లో ఐనారవాణా వ్యవస్థ కీలకం. ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడ్డాయిఅహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పథకానికి భారత, జపాన్‌ ప్రధానులు ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నారు. భారత ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధానమంత్రి షిన్‌జో అబే అహ్మదాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని రైల్వే అధికారులు ప్రకటించారు ఒక్క ట్రిప్పులో 750 మంది ప్రయాణికులను చేరవేయగల సామర్థ్యం ఉన్న ఈ రైలు వల్ల అహ్మదాబాద్‌-ముంబయిల మధ్య ప్రయాణ సమయం ఏడు నుంచి మూడుగంటలకు తగ్గిపోనుంది. ఈ బుల్లేట్ రైల్ సక్సెస్ అయితే తదుపరి బులెట్ రైళ్ళు సికింద్రాబాద్-న్యూ ఢిల్లీ, కోల్కత్తా-విశాకపట్నం-బెంగళూర్-సికింద్రాబాద్ ల మధ్య నడపటం కోసం రూట్ సర్వే చేసే ఆవకాశం ఉందని తెలుస్తోంది.