అమ్మా ధీర వనితా నీకు వందనాలు

SMTV Desk 2017-09-10 12:05:42  Women Empowerment, Indian army, Swathi mahadik, Swati Mahadik

చెన్నై, సెప్టెంబర్ 10 : దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇద్దరు జవాన్ల భార్యలు మనోస్థైర్యానికి సాహసానికి స్పూర్తిదాయక ఉదాహరణలుగా నిలిచారు. భర్తను కోల్పోయిన బాధను దిగమింగుకుని 11 నెలల కఠోర శిక్షణ అనంతరం సైన్యంలో చేరారు. కల్నల్‌ సంతోష్‌ మహదిక్‌ 2015 నవంబర్ లో కశ్మీర్ లోని కుప్వారాలో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరులైయ్యారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఈ బాధ్యత మొత్తం మహాదిక్ భార్య స్వాతిపై పడగా ఆమె సాహోసోపేత అడుగు వేశారు. గతేడాది అక్టోబర్ లో చెన్నైలోని సైనికాధికారుల అకాడమీలో చేరి శిక్షణ పూర్తి చేశారు. శనివారం అకాడమీలో జరిగిన కార్యక్రమంలో స్వాతి (38) సైన్యంలో లాంచనంగా చేరారు. ఆమె 12 ఏళ్ల కుమారై, 7 ఏళ్ల కుమారుడు సైతం ఈ కార్యక్రమానికి హజరయ్యారు. పుణేలోని ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో స్వాతికి లెఫ్టినెంట్‌ గా పోస్టింగ్ ఇచ్చారు. ఇదే తరహాలో గుండెపోటుతో హఠాత్మరణం చెందిన నాయక్ ముకేశ్ దుబే భార్య, నిధి సైతం సైన్యంలో లెఫ్టినెంట్‌ గా చేరారు.