చైనాకు జలక్ ఇచ్చిన భారత్

SMTV Desk 2017-09-10 11:55:32  India, Prime Minister, Modi, China, Taxes, Imports

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి భారతదేశంలోకి దిగుమతి అయ్యే ఉక్కు ఉత్పత్తుల పై ఇదివరకే దిగుమతి సుంకాన్ని విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై అధనంగా 18.95 శాతం సుంకాన్ని విధించనుంది. ఈ సుంకాన్ని ఐదేళ్లపాటు వసూలు చేయునున్నట్లు తెలిపింది. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయం దేశీయ మార్కెట్ కు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న వాటిలో వందకుపైగా వస్తువులపై భారత్ దిగుమతి నిరోధక సుంకాన్ని విధించిన సంగతి విదితమే.