లేజర్ బిజినెస్ కార్డా?

SMTV Desk 2017-09-10 10:39:41  Laser Business Card, New Technology, Visiting card, Business

కెనడా, సెప్టెంబర్ 10: విజిటింగ్ కార్డు, బిజినెస్ కార్డుల గురించి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది. మరి లేజర్ బిజినెస్ కార్డు గురించి తెలుసా! మాములు బిజినెస్ కార్డుకి, ఈ లేజర్ బిజినెస్ కార్డుకి ఉన్న తేడా ఏమిటి?.. మాములు బిజినెస్ కార్డుల్లో వివరాలు ఉంటాయి, ఆ వివరాలు అందరికి కనిపిస్తాయి. మరి లేజర్ బిజినెస్ కార్డులో వివరాలు ఉంటాయి, కానీ ఆ వివరాలు కంటికి కనిపించవు చూడటానికి కార్డు పైకి తెల్లగా కనబడుతుంది అంతే. ఈ కార్డు లోని వివరాలు చూడాలంటే లేజర్ లైట్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే లైట్ ఉంటేనే ఈ కార్డులోని వివరాలను స్పష్టంగా చూడవచ్చు. ఈ లేజర్ బిజినెస్ కార్డు లో మొత్తం మూడు లేయర్ల పేపర్లు ఉంటాయి. మధ్య లేయర్ కట్ తో ఉంటుంది. అందువల్ల మీరు లైట్ దగ్గరకి ఆ కార్డును తీసుకువస్తే అందులో వివరాలు కనిపిస్తాయి. ఈ కార్డును కనిపెట్టింది కెనడాలోని టొరెంటోలో ఉన్న ఆర్ట్ డైరెక్టర్ డోరి. తనకు కొత్త రకంగా ఆలోచించడం అంటే హాబి అని, ఆ ఆలోచనాల రూపమే ఈ కార్డు తయారీ అని డోరి చెప్పుక్కొచ్చారు.