వారం రోజుల్లో అన్ని ఫోన్స్ బుకింగ్... ఎందుకు అంత క్రేజ్

SMTV Desk 2017-09-09 18:57:45  Samsung Galaxy Note 8, Prebooking, amazon, Samsung High End phones

ముంబై, సెప్టెంబర్ 9 : స్మార్ట్ ఫోన్‌ల దిగ్గజ సంస్థ శాంమ్‌సంగ్‌ ఈ నెల 12వ తేదీన శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌8 ఫోన్‌‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను సంస్థ వారం రోజుల ముందే ప్రారంభించగా వినియోగదారుల నుండి అనూహ్య రీతిలో స్పందన లభించి ఇప్పటి వరకు 2.5లక్షల మంది ప్రీ బుకింగ్‌ చేసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇప్పటివరకూ 1.5లక్షల మంది, లక్ష మంది సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. భారత్‌లోనే 43శాతం మార్కెట్‌ శాంమ్‌సంగ్‌కు ఉండటం గమనార్హం. అయితే దక్షిణ కొరియాలో ఈ ఫోన్‌ గత నెలలోనే విడుదలైంది. కాగా, ఈ ఫోన్ ప్రత్యేకతలు విషయాలకు వచ్చేసరికి 6.3 అంగుళాల తాకే తెరతో 6జీబీ ర్యామ్‌,64జీబీ అంతర్గత మెమొరీ వస్తున్న ఈ ఫోన్ 7.1.1 ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ పనిచేయనుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ కలిగిన ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా కలిగి ఉంది. కాగా, 3300ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.