ముద్రగడ కూడా ప్రచారానికి వచ్చి ఉంటే చాలా బాగుండేది: చంద్రబాబు

SMTV Desk 2017-09-09 18:14:47  AP Chief Minister, Chandrababu Naidu, Cabinet Meeting, Mudragada Padmanabham

అమరావతి, సెప్టెంబర్ 9: నేడు అమరావతిలో ఏపీ సీఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఇటీవల కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంపై చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ జగన్‌తో పాటు ముద్రగడ కూడా ప్రచారానికి వస్తే చాలా బాగుండేదంటూ హాస్యాస్పద కామెంట్ చేశారు. ఈ నేపధ్యంలో బాబు మాట్లాడుతూ నంద్యాల ఎన్నిక ఫలితాలతో కాకినాడ నేతలు విశ్రాంతి తీసుకున్నారని, కానీ సీఎం వారిని హెచ్చరించి, పరుగులు పెట్టించానని తెలిపారు. కాగా, కాకినాడలో ప్రచారానికి తాను వచ్చి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేవంటూ ముద్రగడ వ్యాఖ్యానించిన విషయం విదితమే.