విద్యార్థుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసిన మాజీ అధ్య‌క్షుడు ఒబామా..

SMTV Desk 2017-09-09 17:36:55  Washington, McKinley Tech School, Former US President Barack Obama

వాషింగ్టన్, సెప్టెంబర్ 09 : వాషింగ్ట‌న్‌లోని మెక్‌కిన్లీ టెక్ స్కూల్‌లో కొత్త విద్యాసంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్న విద్యార్థుల‌కు స్వాగ‌తం ప‌లికే స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా ఒబామా వ‌స్తున్న విష‌యాన్ని పాఠ‌శాల యాజ‌మాన్యం విద్యార్థుల‌కు చెప్ప‌లేదు. త‌మ పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న చిన్న అంత‌ర్గ‌త స‌మావేశానికి అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఒక్కసారిగా లోపలికి అడుగు పెట్టడంతో విద్యార్థులంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. దీంతో త‌మ స‌మావేశం జ‌రుగుతుండ‌గా ఒబామా రావ‌డంతో విద్యార్థులకు ఆశ్చ‌ర్యంతో నోట మాట రాలేదు. వాళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్న వీడియోను ఒబామా త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశారు.