మిలటరీలోకి రానున్న మహిళా సైన్యాలు

SMTV Desk 2017-09-09 16:35:49  Womans choice of jawans, Law, medical, educational engineering, Cantonment

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09 : సైన్యంలో మహిళ జవాన్ల ఎంపిక దిశగా మరో అడుగు ముందుకు పడనుంది. ఇప్పటికే సైన్యంలోని న్యాయ, వైద్య,విద్యా ఇంజనీరింగ్ విభాగంలో మహిళలు సేవలు అందిస్తుండగా, తాజాగా సైనిక పోలీసుల విభాగంలోనూ నియమించనున్నారు. ప్రణాళికకు తుదిరూపు ఇచ్చిన సైన్యం ఏడాదికి 52 మంది చొప్పున 8 వందల మందిని నియమించాలని భావిస్తుంది. సైనిక కేంద్రాలు కంటోన్మెంట్ లో పోలీసు విధులు సహా సైనిక నియమాలు ఉల్లంఘించకుండా చూడడం రవాణా పరమైన సాయం చేయడం వంటివి సైనిక పోలీసు విధుల్లో భాగంగా ఉండనున్నాయి.