మెక్సికో భూకంప ధాటికి పెరుగుతున్న మృతుల సంఖ్య

SMTV Desk 2017-09-09 15:44:03  Mexico, Earthquake, Oaxaca, Chiipus

మెక్సికో, సెప్టెంబర్ 09 : మెక్సికోలో గత వందేళ్లలోనె అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపానికి బలైన వారి సంఖ్య 61కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి వచ్చిన భూకంప ధాటికి కుప్పకూలిన ఇళ్ల కింద మరికొందరు చిక్కుకుని ఉండగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయాలు చేపడుతున్నారు. 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పసిఫిక్ తీరా రాష్ట్రాలైన ఒయాక్సాకా, చియపస్‌ తీరని నష్టం జరిగింది. ఈ ఘటనలో అనేక భవనాలు కుప్పకూలాయి. ఇల్లు కూలిపోయి కొందరు మరో మారు ప్రకంపనలు వస్తాయేమోనని కొందరు రోడ్లపైనే వెళ్లదీస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బ తినగా 18 లక్షలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూకంపం ధాటికి ఇప్పటికే కథ విఫలమైన మెక్సికోలు కథియ తుఫాను అంతకంతకూ తీవ్ర రూపు దాల్చడం ప్రజలను ఆందోళనలు చేస్తుంది. తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.